
హ్యాకర్లను మించిపోయే 'జీపీటీ-6' లాంచ్ చేసిన ఓపెన్ఏఐ
సైబర్ భద్రతా రంగంలో ఓపెన్ఏఐ కీలక ముందడుగు వేసింది. సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్‌లలో భద్రతా లోపాలను గుర్తించి, వాటిని పరీక్షించగల ‘జీపీటీ-6 సైబర్’ ఏఐ మోడల్‌ను నవంబర్ 5న ఎంపిక చేసిన నిపుణులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ మోడల్ ఫైర్‌ఫాక్స్‌లో 81 తీవ్రమైన లోపాలను, లైనక్స్ కెర్నల్లో 948 లోపాలను గుర్తించినట్లు సంస్థ తెలిపింది. దాని సామర్థ్యాల దృష్ట్యా ‘క్రిటికల్’ రేటింగ్ ఇచ్చింది. దుర్వినియోగం కాకుండా ఎంపిక చేసిన సైబర్ సెక్యూరిటీ నిపుణులకే ప్రస్తుతానికి యాక్సెస్ కల్పిస్తోంది.




