వైభవంగా కోట మునీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

3చూసినవారు
కుప్పం మండలం కమ్మగుట్టపల్లి గ్రామంలో శ్రీ ప్రసన్న కోట మునీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 21 ఏళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, 5 రోజుల పాటు జరిగే ఈ జాతరలో భాగంగా జూలై 4న అగ్నిగుండం, 5న అన్నదానం, దీపారాధన కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ధర్మకర్త వెంకటరమణ తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పూజారి మల్లప్ప, మునిస్వామి తదితర భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్