కుప్పం: పింఛన్లు పంపిణీ చేసిన సీఎం

1646చూసినవారు
కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బెగ్గిపల్లెలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వారికి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మునెమ్మ అనే వృద్ధురాలికి వృద్ధాప్య పింఛను, చిన్నతాయమ్మ అనే మహిళకు వితంతు పింఛను, వెంకటరామప్పకు వృద్ధాప్య పింఛను అందజేశారు.

సంబంధిత పోస్ట్