కుప్పం: ఆలయాన్ని శుద్ధి చేసిన కూటమి నేతలు

1777చూసినవారు
కుప్పం మున్సిపాలిటీలోని లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయాన్ని గురువారం కూటమి నేతలు పాలు, పసుపు, కుంకుమ నీళ్లతో శుద్ధి చేశారు. వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి రసాయనాలతో కూడిన నెయ్యిని ఉపయోగించినట్లు సిట్ నివేదిక పేర్కొందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, పికేఎం ఉడా ఛైర్మన్ డా. సురేశ్, టీటీడీ బోర్డు సభ్యుడు వైద్యం శాంతారాం ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని వారు శుద్ధి చేశారు.

సంబంధిత పోస్ట్