ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో, ఏర్పాట్లను బుధవారం నాడు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ, కడ పీడీ వికాస్ మర్మత్ పరిశీలించారు. గుడిపల్లి (M) పొగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో పలు పరిశ్రమలకు శంకుస్థాపన, MOUతో పాటు ABIS ప్రోటీన్స్ పరిశ్రమను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభ ప్రాంగణం, హెలిప్యాడ్ ప్రాంగణాన్ని వారు పరిశీలించారు.