కుప్పం: ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం: మంజునాథ్

4210చూసినవారు
కుప్పం పట్టణంలో ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిర్మూలించాలని చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు మంజునాథ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసరావు, సంఘం అధ్యక్షుడు మంజు వ్యాపారులకు ఐడీ కార్డులను అందజేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఈ సందర్భంగా సూచించారు.

సంబంధిత పోస్ట్