గుడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో NSS 56వ వార్షిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ డేను భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 24న జరుపుకునే ఒక ప్రత్యేక దినోత్సవం. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే జాతీయ సేవా పథకం స్థాపనను పురస్కరించుకుని ఈరోజును నిర్వహిస్తారని ప్రిన్సిపాల్ రామకృష్ణమ నాయుడు పేర్కొన్నారు. NSS లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.