కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21, 22 తేదీల్లో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి పర్యటన ప్రాంతాలను ఆదివారం పరిశీలించారు. జలహారతి, బహిరంగ సభ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.