
పుత్తూరు:రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి
నగరి నియోజక వర్గం, పుత్తూరు-పూడి దిగువ వైపు వెళ్ళు రైలు మార్గం దగ్గర కిలోమీటర్ నెంబర్ 111/26-28 పోస్ట్ వద్ద శనివారం గుర్తు తెలియని మగ వ్యక్తి శవం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల వివరాల మేరకు గాయపడిన వ్యక్తి రైలు నుండి పడి కలిగిన గాయాలకు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి వయసు 75 సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతుడు తెలుపు రంగు హాఫ్ షర్టు, తెల్ల పంచ ఎర్ర బార్డర్ కలది కట్టుకున్నాడన్నారు.





































