సోమవారం ఉదయం నగరి నియోజకవర్గం, నిండ్ర మండలం, కూనమరాజుపాళెంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని విశాఖపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువగళం నేత ఆడారి కిషోర్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గీతామందిర ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానంద స్వామి అమ్మవారి కుంకుమ, ప్రసాదం, శేష వస్త్రం అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రూపేష్ క్రిష్ణ ఆచార్య వేద మంత్రాలతో ఆశీర్వదించారు.