నగరిలో గంగజాతర ప్రారంభం

974చూసినవారు
నగరిలో గంగజాతర ప్రారంభం
నగరి పట్టణంలో గంగజాతర సందడి ఆదివారం మొదలైంది. జాతర సాంప్రదాయ ఆచార వ్యవహారాల్లో భాగంగా గంగమ్మ తల్లికి ప్రీతికరమైన గరిగ ఉత్సవాన్ని తలారి వీధి గంగమ్మ గుడి వద్ద నిర్వాహకులు ప్రారంభించారు. జాతర హద్దుల్లో ఉన్న ఇళ్లకు ఊరేగింపుగా వెళ్లిన గరిగకు పసుపుకుంకుమల నీటితో హారతులు తీసి దర్శించుకున్న మహిళలు నైవేద్యం సమర్పించి బండారం స్వీకరించారు. గరిగ ప్రారంభోత్సవంలో జాతర నిర్వాహకులు జ్యోతిరెడ్డి, చిరంజీవి రెడ్డి, టీకే మధన శ్రీనివాసన్, మణిగండ, శ్రీను, బాలాజి, జనార్ధన్, ప్రసాద్, సేడ్, రాజేష్, అశోక్, సునీల్, రవి, కుమార్, మహేష్, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్