చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం, నిండ్ర మండలం, అత్తూరు గ్రామంలో మంగళవారం పోలీసులు అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని ఒక ప్రాంతంలో 34 సంచులలో సుమారు రెండు టన్నుల బియ్యం ఉన్నట్లు సమాచారం అందడంతో ఎస్సై మల్లికార్జున్ నేతృత్వంలో దాడులు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన వారి కోసం పోలీసులు విచారణ చేపట్టారు.