నగరి ప్రజలకు సీఐ విక్రమ్ ఆదివారం ముఖ్యమైన సూచనలు చేశారు. బంగారం ధరలు పెరగడంతో చోరీలు కూడా ఎక్కువయ్యాయని, తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రజలు విలువైన ఆభరణాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని, బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. కుటీర పరిశ్రమలు, విలువైన ఆభరణాలు ఉన్నవారు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.