మాజీ మంత్రి ఆర్కే రోజా రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరిలోని తన నివాసంలో బుధవారం ఆమె మాట్లాడుతూ, ప్రజలందరూ ఈ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయకుడిని పూజిస్తే ప్రతి పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం అవుతాయని ఆమె తెలిపారు.