కూటమి పాలనలో నగరి నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అత్తూరు, ఆగరం పేట గ్రామాల ప్రజలు ఆదివారం తెలిపారు. గ్రామాలకు వెళ్లే రోడ్లు, గ్రామాలలో వీధుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, గతంలో గుంతలు, బురదతో అధ్వానంగా ఉన్న అత్తూరు నుండి అగరంపేట వరకు ఉన్న రోడ్లు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చొరవతో బాగుపడుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.