పుత్తూరు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సీజనల్ వ్యాధుల నియంత్రణపై మున్సిపాలిటీ పరిధిలోని పలు శాఖల అధికారులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మంజునాథ గౌడ్ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి జ్వర సర్వేలు, అన్ని వార్డులలో ఫాగింగ్, అంగన్వాడీ, వసతి గృహాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పట్టణంలోని అన్ని ప్రాంతాలలో పరిశుభ్రత కార్యక్రమాలను ముమ్మరంగా చేయాలని అధికారులను ఆదేశించారు.