నగరి నియోజకవర్గం, పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆత్మగౌరవ నిరసన చేపట్టారు. తమకు రెండు ఇంక్రిమెంట్లను తక్షణం మంజూరు చేయాలని, అలాగే వాలంటీర్ల విధుల నుంచి తమకు విముక్తి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.