నిండ్ర మండలం, కూనమరాజుపాళెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, లక్ష్మీ నారాయణ హోమం జరిపారు. ఉభయదారులు నారాయణవనం వేణు ఆచారి, అర్చన నూతన దంపతులచే శ్రీ రమా సహిత సత్యనారాయణ వ్రతం చేపట్టారు. చంద్ర గ్రహణం కారణంగా మధ్యాహ్నం లోపు పూజలు పూర్తి చేసి, సాయంత్రం ఆలయ తలుపులు మూసివేశారు.