వడమాల పేట సంజీవరాయుని ఆలయంలో ప్రత్యేక పూజలు

1065చూసినవారు
నగరి నియోజకవర్గం, వడమాలపేటలోని శ్రీ సంజీవరాయ స్వామి వారి ఆలయంలో శనివారం ప్రత్యేక వడమాల, ఆకు పూజలు జరిగాయి. శ్రావణమాసంలో చివరి శనివారం సందర్భంగా ఈ పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని అన్నమాచార్య ప్రాజెక్ట్ వారిచే అన్నమాచార్య సంకీర్తనల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ పూజలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.