నగరిలో స్త్రీ శక్తి విజయోత్సవ సభ

1476చూసినవారు
చిత్తూరు జిల్లా నగరి మార్కెట్ యార్డులో శనివారం స్త్రీ శక్తి సూపర్ సిక్స్ విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలకు గతంలో వడ్డీలేని రుణాలు లేవని, ఇప్పుడు రూ.10 లక్షల వరకు వడ్డీ లేకుండానే రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అభివృద్ధిని కూటమి ప్రభుత్వమే చేసి చూపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్