పుత్తూరులో అంగరంగ వైభవంగా గొడుగుల సమరసత యాత్ర

1067చూసినవారు
శనివారం, నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీవారి గొడుగుల సమరసత యాత్ర వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నై నుంచి తిరుమలకు వెళ్తున్న ఈ గొడుగులను పుత్తూరులో మంగళ వాయిద్యాలతో స్వాగతించారు. పట్టణంలోని వివిధ వీధుల గుండా ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు గోవింద నామస్మరణతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్