
పెనుమూరు: వర్షాలతో ఆ గ్రామాలకు దారి కట్
చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెనుమూరు మండలంలోని బండపల్లి, చిన్నకలికిరి, తుపల్లి, పెద్దకలికిరి, మోరవ కండ్రగ, నంజరపల్లి, గొల్లపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీవానది ఉద్ధృతికి రోడ్డు మార్గం నీటిలో కొట్టుకుపోవడంతో, ఈ గ్రామస్థులు ప్రత్యామ్నాయంగా పూతలపట్టు, పెనుమూరు క్రాస్ మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల వారి ప్రయాణ దూరం 10 కిలోమీటర్లు పెరుగుతుంది.


































