పెద్ద బాలశిక్ష పుస్తకాల పంపిణీ

2చూసినవారు
పెద్ద బాలశిక్ష పుస్తకాల పంపిణీ
పలమనేరు డాక్టర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో పెద్ద బాలశిక్ష పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు పి. తులసినాథం నాయుడు మాట్లాడుతూ పాఠ్యపుస్తకాలతో పాటు ప్రాపంచిక జ్ఞానం, విలువలను అందించే ఇతర పుస్తకాలను చదవడం ద్వారా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్