బైరెడ్డిపల్లి మండలంలో ఈ నెల 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 2 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వైద్యులు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఆనంద్ బాబు, డాక్టర్లు విజయచందర్, సుస్మిత గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తీర్థం, బైరెడ్డిపల్లి పీహెచ్సీ సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.