తాగునీటి సమస్యపై ముందస్తు చర్యలు

1219చూసినవారు
తాగునీటి సమస్యపై ముందస్తు చర్యలు
పలమనేరు నియోజకవర్గంలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి టీడీపీ నాయకులకు సూచించారు. శనివారం పలమనేరు టీడీపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో సమావేశమై నీటి సమస్యలు, అభివృద్ధి పనులపై సమీక్షించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్