కుప్పం లో రైతుల ర్యాలీ సందర్భంగా రాళ్లబూదుగూరు పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి,
టీడీపీ నాయకులు శుక్రవారం కుప్పం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో మొత్తం 28 మందిపై కేసు నమోదైంది, ఇందులో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఏ-1గా ఉన్నారు. తదుపరి విచారణను అక్టోబర్ 5కు కోర్టు వాయిదా వేసింది.