గురువుదేవర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమరనాథరెడ్డి

543చూసినవారు
గురువుదేవర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమరనాథరెడ్డి
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ గౌదమాకులపల్లెలో ఆదివారం ఐదేళ్లకోసారి జరిగే గురువుదేవర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయనకు గ్రామస్తులు ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పంచాయతీ నాయకులు, ఎంపీటీసీ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్