పలమనేరు: అనుమతుల ప్రకారమే నిర్మాణం చేపట్టాలి: కమిషనర్

2437చూసినవారు
పలమనేరులో భవన నిర్మాణాలు అనుమతుల ప్రకారమే జరగాలని మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన జెవిలి వీధి, మదనపల్లె రోడ్డు, బజారు వీధి, కాకాతోపులలో నిర్మాణంలో ఉన్న బిల్డింగులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాన్ ప్రకారం లేని నిర్మాణాలను ఆపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ ఇందిర, రెవెన్యూ ఆఫీసర్ అనిల్, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.