పలమనేరు మండలం గజ్జలవారిపల్లిలో గురువారం ఉదయం నల్ల గంగమ్మ ఆలయంలో చోరీకి పాల్పడుతున్న యువకుడిని గ్రామస్థులు పట్టుకున్నారు. అతన్ని చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. యువకుడు కురపల్లి జగనన్న కాలనీకి చెందిన వాడిగా గుర్తించారు. మంగళవారం రాత్రి ఎగువ కల్లాడులో జరిగిన చోరీ నేపథ్యంలో గ్రామస్థులు అప్రమత్తంగా ఉన్నారు.