చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలోని తీర్థం పంచాయతీలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు వర్షాల కారణంగా సగానికి పైగా దిగుబడి తగ్గిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి సహాయం అందిస్తామని హార్టికల్చర్ ఆఫీసర్ విజయమ్మ రైతులకు హామీ ఇచ్చారు.