స్వచ్ఛతపై పలమనేరులో విస్తృత అవగాహన

3చూసినవారు
స్వచ్ఛతపై పలమనేరులో విస్తృత అవగాహన
పలమనేరు పురపాలక సంఘం పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కమిషనర్ కె. లోకేశ్వర వర్మ పర్యవేక్షణలో డ్రెయిన్ల శుభ్రత, డీసిల్టింగ్, బ్లీచింగ్ పనులు చేపట్టారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు దూరంగా ఉండటం, మొక్కలు నాటడం, మాంసం దుకాణాల్లో పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు. త్వరలో STP ఏర్పాటు, పెద్ద చెరువు సుందరీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్, సచివాలయ, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్