ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసై మహిళ హత్య: ఇద్దరు స్నేహితులతో కలిసి ఘాతుకం

1797చూసినవారు
గురువారం, 2 ఏప్రిల్ 2026న, చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మిద్దెపల్లికి చెందిన చంద్రమ్మ (36) అనే మహిళను సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసై, ఆమె వద్ద సుమారు రెండు లక్షల వరకు అప్పుపడ్డాడు. అప్పు తీర్చలేక, ఆమెను హత్య చేయాలని పక్కా ప్రణాళికతో తన ఇద్దరు స్నేహితులతో కలిసి లింగాపురం వద్ద మామిడితోటలో రాడ్డుతో కొట్టి, గొంతు కోసి చంపి, బొలెరో వాహనంలో శవాన్ని జగమర్లక్రాస్ రోడ్డులో పడేశారు. పంజాణి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయిన తరుణంలో, సుబ్రహ్మణ్యం టీషర్టుపై రక్తపు మరకలు కనిపించడంతో అనుమానంతో అరెస్టు చేసిన పోలీసులు, విచారణలో ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చిందని DSP డేగల ప్రభాకర్ రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్