
పలమనేరు: ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్
పలమనేరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేయనున్నట్లు రైతు రాజమ్మ తెలిపారు. మండిపేట కోటూరుకు చెందిన రాజమ్మ, ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆకుకూరలు, కాయగూరలను విక్రయిస్తున్నారు. ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద స్టాల్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. రైతు సాధికార సంస్థ ద్వారా తాను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు రాజమ్మ తెలిపారు.




































