పలమనేరు - Palamaner

అంగన్వాడి కేంద్రంలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

అంగన్వాడి కేంద్రంలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

పట్టణంలోని గాంధీ నగర్ అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ అర్బన్ సెక్టార్ ఆధ్వర్యంలో వర్కర్ సుబ్బమ్మ అధ్యక్షతన ముందస్తు సంక్రాంతి సంబరాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఐసిడిఎస్ సిడిపిఓ ఉమారాణి ముఖ్య అతిథిగా హాజరై, సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను, సాంప్రదాయ కార్యక్రమాలను వివరించారు. అంగన్వాడి కేంద్రంలో వివిధ రకాల ముగ్గులు, అలంకరణలతో పాటు, చిన్నారుల వేషధారణలతో కూడిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని అంగన్వాడి సిబ్బంది విజయవంతంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు.

వీడియోలు


జగిత్యాల జిల్లా