
పలమనేరు: సీఎంకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే
సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారి పల్లెకు విచ్చేసినప్పుడు, సోమవారం పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. నారావారిపల్లి సమీపంలోని హెలిప్యాడ్ వద్ద తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను మంత్రికి వివరించారు.






































