బంగారుపాళ్యం: యువతి అదృశ్యంపై కేసు నమోదు: సీఐ

2343చూసినవారు
బంగారుపాళ్యం: యువతి అదృశ్యంపై కేసు నమోదు: సీఐ
మండలంలోని శెట్టిరి దళితవాడికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక ఈ నెల 25వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. బాలిక తల్లిదండ్రులు బంధువుల ఇళ్లలో, చుట్టుపక్కల ప్రదేశాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. బాలిక తల్లి నీరజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్