పూతలపట్టులో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

0చూసినవారు
పూతలపట్టులో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
పూతలపట్టులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన మండల అధ్యక్షుడు మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ శివప్రసాద్, తవణంపల్లి మండల అధ్యక్షుడు రాజశేఖర్, బంగారుపాళ్యం ఉపాధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీ తులసీ ప్రసాద్‌తో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్