
రొంపిచర్ల హైవేపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల హైవేపై ఆదివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు రొంపిచర్ల కు చెందిన లతీఫ్ పీలేరులో మేస్త్రి పనికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వస్తుండగా తిరుపతి -మదనపల్లి హైవేపై ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం లతీఫ్ వాహనాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు అతడిని 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





































