పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దిగు పల్లి గ్రామంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారికి వేద పండితులు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు చండీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.