పుంగనూరు: ప్రమాదవశాత్తు చెరువులో పడిన మహిళ క్షేమం

1782చూసినవారు
పుంగనూరు: ప్రమాదవశాత్తు చెరువులో పడిన మహిళ క్షేమం
పుంగనూరులోని పుంగమ్మ చెరువు కట్ట వద్ద శనివారం ఒక మహిళ ప్రమాదవశాత్తు అదుపుతప్పి చెరువులో పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా బయటకు తీసి, పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు గుర్తించిన ప్రకారం, ఆ మహిళ పట్టణంలోని సుబేదావీధికి చెందిన జువేరియా (22) అని తెలిసింది. అనంతరం ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్