రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన సదుం మండలంలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాల మేరకు పీలేరు మండలం రేగల్లు గ్రామపంచాయతీ, బోయపల్లి గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు సదుం- కలికిరి మార్గంలో రెడ్డివారిపల్లి బస్సు స్టాప్ వద్ద బైక్ ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.