బోయకొండ అటవీ ప్రాంతంలో హత్య.. భార్యతో సహా ముగ్గురి అరెస్ట్

223చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చౌడేపల్లి సమీపంలోని బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తి హత్యకు గురైన ఘటనలో పోలీసులు నిందితులను గురువారం పట్టుకున్నారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతుడి భార్యతో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దేవరకొండ నరసింహులు, దేవరకొండ లక్ష్మీపతి, రాసాతి, దేవరకొండ నాగరాజు@నాగులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సాయి ప్రసాద్ తెలిపారు. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని సీఐ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్