పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం ఎర్రాతి వారిపల్లెలో శనివారం వైఎస్ఆర్సిపి పార్టీ విస్తృత సమావేశం మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రజలకు సంక్షేమం అందించడమే తమ పాలన అజెండా అని, వచ్చే జగన్మోహన్ రెడ్డి పాలనలో కార్యకర్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సజ్జల తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.