సత్యవేడు (M) చెరివి క్రాస్ వీకేఆస్ఐ కాలనీ సమీపంలో కూరగాయల లోడుతో వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.