తిరుపతిలో జరిగిన కూటమి విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి మేలు జరిగిందని, చీకటి నుంచి వెలుగులోకి వచ్చామని అన్నారు. 2014లో రాష్ట్రానికి నష్టం జరిగితే, గత వైసిపి ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. తాను 53 రోజులు జైల్లో ఉన్నానని కూడా ఆయన తెలిపారు.