సత్యవేడు: గంజాయి కేసులో పరార్లో ఉన్న మరో నిందితుడు అరెస్టు

1197చూసినవారు
సత్యవేడు: గంజాయి కేసులో పరార్లో ఉన్న మరో నిందితుడు అరెస్టు
సత్యవేడు పోలీసు స్టేషన్ లో నమోదు అయిన గంజాయి కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడు దినకరన్(27)ను సత్యవేడు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గత డిసెంబరు 3వతేదీన 2కేజీల గంజాయితో యువకుడు మహేష్ ను సత్యవేడు పోలీసులు అరెస్టు చేసి, మోటార్ సైకిల్ స్కూటీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుడు మహేష్ ఉలవచేను వాసిగా గుర్తించారు. ఈ కేసులో పరారీలో ఉన్న దినకరన్ ను పోలీసులు పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్