పిచ్చాటూరు మండలంలోని వేలూరు విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి రామాపురం చెరువుకు నీరు తీసుకెళ్లే కాలువ పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లతో నిండిపోవడంతో చెరువుకు సక్రమంగా నీరు అందడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువను వెంటనే పూడికతీత పనులు చేపట్టాలని రైతులు ఇరిగేషన్ అధికారులను, నీటి సంఘ అధ్యక్షుడిని కోరుతున్నారు. కాలువ శుభ్రం చేస్తేనే చెరువుకు నీటి ప్రవాహం మెరుగుపడుతుందని రైతులు పేర్కొంటున్నారు.