సత్యవేడు: నేడు "నందీశ్వరునికి "త్రయోదశి ప్రదోష పూజలు

303చూసినవారు
సత్యవేడు: నేడు "నందీశ్వరునికి "త్రయోదశి ప్రదోష పూజలు
నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలోని శ్రీపల్లికొండేశ్వరస్వామి ఆలయంలో నేడు (శుక్రవారం) ప్రదోష పూజలు జరుగుతాయని ఆలయ ధర్మకర్త, మండల చైర్మన్ పద్మనాభరాజు తెలిపారు. ప్రతి నెలా పౌర్ణమికి ముందు, అమావాస్యకు ముందు త్రయోదశి తిథి రోజున సాయంత్రం సంధ్యవేళలో నందీశ్వరునికి విశేషంగా ప్రదోష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో, నేడు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నందీశ్వరునికి త్రయోదశి ప్రదోష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్