సత్యవేడు: దాతల సాయంతో పాఠశాలలో మరుగుదొడ్డి ప్రారంభం

235చూసినవారు
సత్యవేడు: దాతల సాయంతో పాఠశాలలో మరుగుదొడ్డి ప్రారంభం
వరదయ్యపాలెం మండలం పాండూరు పంచాయతీలోని వెంగారెడ్డికండ్రిగ ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో అధునాతన మరుగుదొడ్డిని నిర్మించి ప్రారంభించారు. గతంలో మరుగుదొడ్డి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా, ఉపాధ్యాయుడు ఆనంద్ లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. లోకా ఫౌండేషన్, గిరిధర్ రెడ్డి, విశ్రాంత ప్రిన్సిపల్ దయాకర్ రెడ్డి, అల్లు పార్థసారథిల సహకారంతో మొత్తం 2 లక్షల రూపాయల నిధులతో ఈ కార్పొరేట్ తరహా మరుగుదొడ్డిని నిర్మించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్