శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ సుధీర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 'పల్లె వెలుగు' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కార మార్గాలపై సూచనలు అందించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అవసరమని, అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మహిళలు, పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పోలీస్-ప్రజల మధ్య నమ్మకం పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఎస్ఐ పేర్కొన్నారు.